కానిస్టేబుల్పై దాడి చేసిన యువకులు

కానిస్టేబుల్పై దాడి చేసిన యువకులు

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కొందరు యువకులు పోలీస్ స్టేషన్లోనే హెడ్ కానిస్టేబుల్పై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 3న ఈ ఘటన జరగగా.. దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 

ఆగస్టు 3న ఆనంద్ విహార్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన దాదాపు 10 - 12 మంది యువకులు అక్కడ పనిచేసే హెడ్ కానిస్టేబుల్పై ఒక్కసారిగా దాడికి దిగారు. కొందరు కానిస్టేబుల్ను కొడుతుండగా.. మిగిలిన వారు సెల్ ఫోన్లలో ఆ వీడియో రికార్డు చేశారు.  అయితే వారు ఎందుకు దాడి చేశారన్న విషయం మాత్రం తెలియలేదు. దెబ్బలు తాళలేక కానిస్టేబుల్ క్షమాపణ కోరుతున్నా వారు మాత్రం కనికరం చూపకుండా దాడి కొనసాగించారు. కానిస్టేబుల్పై దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. కేసు నమోదుచేసి నిందితుల కోసం వేట మొదలుపెట్టారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.