
అల్లరి చేస్తున్నారనే కారణంతో విద్యార్థులను క్లాస్ రూమ్ లోనే తాళ్లతో కట్టేశారు ప్రధానోపాధ్యాయులు. ఈ ఘటన అనంతపురం జిల్లా కదిరిలోని మశానంపేట మున్సిపల్ ప్రాథమికోన్నత పాఠశాలలో జరిగింది. రెండు, మూడు తరగతులలు చదువుతున్న నలుగురు విద్యార్థులను టేబుల్స్ కు తాళ్లతో కట్టేసి బంధించారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగారు. ఆర్డీఓ రామసుబ్బయ్య, ఎంఈఓ చెన్నకృష్ణ విద్యార్థులను విచారించారు. అల్లరి చేస్తున్నామని తమను హెచ్ఎం కట్టేసినట్లు విద్యార్థులు చెప్పారు.