ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ఉద్యోగ రంగంపై ఎలా ఉండబోతుందో మైక్రోసాఫ్ట్ తాజాగా ఒక సంచలన నివేదికను విడుదల చేసింది. తన 'కోపైలట్' చాట్‌బాట్‌తో జరిగిన లక్షలాది సంభాషణలను విశ్లేషించిన మైక్రోసాఫ్ట్, ఏ ఉద్యోగాలకు AI వల్ల ముప్పు ఎక్కువగా ఉందో లిస్ట్ సిద్ధం చేసింది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, 'గాడ్ ఫాదర్ ఆఫ్ AI' జెఫ్రీ హింటన్ వంటి ప్రముఖులు ఇప్పటికే ఏఐ వల్ల ఉద్యోగాల కోత తప్పదని సూచించిన సంగతి తెలిసిందే.
మైక్రోసాఫ్ట్ నివేదిక ప్రకారం AI వల్ల అత్యధిక రిస్క్ ఉన్న కీలక ఉద్యోగాల జాబితా:
1. CNC టూల్ ప్రోగ్రామర్లు
2. టెలిఫోన్ ఆపరేటర్లు
3. ట్రావెల్ క్లర్కులు & టికెట్ ఏజెంట్లు
4. రేడియో జోకీలు & బ్రాడ్‌కాస్ట్ అనౌన్సర్లు
5. బ్రోకరేజ్ క్లర్కులు
6. టెలిమార్కెటర్లు
7. న్యూస్ అనలిస్టులు & రిపోర్టర్లు
8. జర్నలిస్టులు & ఎడిటర్లు
9. గణిత శాస్త్రవేత్తలు
10. టెక్నికల్ రైటర్లు & ప్రూఫ్ రీడర్లు
11. పబ్లిక్ రిలేషన్స్ స్పెషలిస్టులు
12. అడ్వర్టైజింగ్ సేల్స్ ఏజెంట్లు
13. డేటా సైంటిస్టులు
14. పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్లు
15. వెబ్ డెవలపర్లు
16. మార్కెట్ రీసెర్చ్ అనలిస్టులు
17. బిజినెస్ & ఎకనామిక్స్ టీచర్లు (ఉన్నత విద్య)
18. పొలిటికల్ సైంటిస్టులు
19. మేనేజ్‌మెంట్ అనలిస్టులు
20. మోడల్స్
21. స్టాటిస్టికల్ అసిస్టెంట్లు
22. లైబ్రరీ సైన్స్ టీచర్లు
23. కౌంటర్ & రెంటల్ క్లర్కులు
24. హోస్టులు
25. పబ్లిక్ సేఫ్టీ టెలికమ్యూనికేటర్లు
26. జియోగ్రాఫర్లు
27. స్విచ్ ఆపరేటర్లు
28. ఎకనమిక్స్ టీచర్లు
ALSO READ : క్రిప్టోలో ట్రేడింగ్ వద్దు SIP ముద్దు..
ఎందుకు ఈ మార్పు?
ఈ ఉద్యోగాలలో జరిగే చాలా పనులు AI చాట్‌బాట్‌లు అత్యంత వేగంగా, ఖచ్చితంగా చేయగలవు. సమాచారాన్ని విశ్లేషించడం, కోడింగ్ రాయడం, రిపోర్టులు సిద్ధం చేయడం వంటి అంశాల్లో ఏఐ ఇప్పటికే మానవ మేధస్సుతో పోటీ పడుతోంది. అయితే ఈ మార్పును గమనించి కొత్త నైపుణ్యాలను నేర్చుకుని అప్ స్కిల్లింగ్ చేసుకోవటమే దీనికి పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు.
