సర్కారీ స్కూళ్లకు ఉచిత కరెంట్ ఇవ్వాలి .. డిప్యూటీ సీఎంకుహెడ్మాస్టర్ల సంఘం వినతి

సర్కారీ స్కూళ్లకు ఉచిత కరెంట్ ఇవ్వాలి .. డిప్యూటీ సీఎంకుహెడ్మాస్టర్ల సంఘం వినతి

హైదరాబాద్, వెలుగు :  గ్రామాలు, పట్టణాల్లోని సర్కారీ బడులకూ ఉచిత విద్యుత్  సౌకర్యాన్ని కల్పించాలని తెలంగాణ స్టేట్ గెజిటెడ్ హెడ్మాస్టర్స్ అసోసియేషన్ (టీఎస్​జీహెచ్ఏ) కోరింది. శుక్రవారం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజభాను చంద్రప్రకాశ్, రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి గిరిధర్ తో కలిసి సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశారు.

వివిధ సమస్యల పరిష్కారం కోసం ఆయనకు వినతిపత్రం అందించారు. కొన్ని నెలలుగా పెండింగ్​లో ఉన్న  టీచర్లు, ఎంప్లాయీస్ బిల్లులను, సప్లిమెంటరీ బిల్లులను చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. సమగ్ర శిక్షలో స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ గ్రాంట్ కింద రూ.150 కోట్లు విడుదల చేయాల్సి ఉందని, వెంటనే వాటిని రిలీజ్ చేయాలని కోరారు. దీంతో పాటు ఎస్ఎస్ఏ ప్రాజెక్టులో పనిచేసే ఉద్యోగులకు నవంబర్ నెల వేతనాలివ్వాలని పేర్కొన్నారు.