Summer Special: మట్టి కుండ నీరు.. మహా ఔషధం..

Summer Special: మట్టి కుండ నీరు.. మహా ఔషధం..

 ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా.. నంబర్ ఆఫ్ ఫీచర్స్‌తో రిఫ్రిజిరేటర్స్ డెవలప్ చేసినా.. మట్టి కుండ ప్రత్యేకతే వేరు. అందులోని నీరు తాగితే వచ్చే మజానే వేరు. కానీ పట్టణీకరణలో పడిపోయి హెల్తీ హ్యాబిట్స్ మానేసి రిచ్‌నెస్ మెయింటెన్ చేసేందుకు ఫ్రిడ్జ్‌లకు ప్రాధాన్యత ఇస్తున్న వారి సంఖ్యే ఎక్కువ. కాగా మట్టి కుండలో నీటిని తాగడం వల్ల కలిగే లాభాల గురించి తెలిస్తే ఆ పని చేయబోరని అంటున్నారు నిపుణులు. పైగా ఫ్రిడ్జ్ వాటర్‌తో సైడ్ ఎఫెక్ట్స్ వస్తే.. కుండ నీరు వాటిని హీల్ చేయడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది. ఇంతకీ దీనివల్ల కలిగే లాభాలేంటో వివరంగా తెలుసుకుందాం.

మన భారతీయ సంప్రదాయ పద్ధతుల్లో మట్టి కుండలలో నిల్వ ఉంచిన నీటిని తాగడం ఒకటి. సింధు నాగరికత కాలం నుంచి ఇదే పద్దతి పాటిస్తున్నాం.ఈ మధ్య కాలంలో ఇతర దేశాల వారు కూడా ఇదే పద్దతిని పాటిస్తున్నారు. ఎందుకంటే కుండలో నీరు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.ఈ కుండను బంకమట్టితో తయారు చేస్తారు. సహజ ఆల్కలీన్‌గా చెప్పబడే ఇది.. నిల్వ చేసిన నీటి పీహెచ్ లెవల్స్ బ్యాలెన్స్‌డ్‌గా ఉంచుతూ జీర్ణ సమస్యలను దరి చేరనీయదు. ఇందులోని నేచురల్ మినరల్స్ జీవక్రియను మెరుగుపరిచి.. మలబద్ధకాన్ని నివారిస్తాయి. ఒంట్లో వేడిని తగ్గించి.. బరువు తగ్గించడంలోనూ కీలకంగా పనిచేస్తుంది. వేసవిలో తలెత్తే కంటి సమస్యలు, అలెర్జీ నుంచి కాపాడుతుంది. శరీరంలోని గాయాలను హీల్ చేయడంతోపాటు వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్‌ను దూరంగా ఉంచుతుంది.

కుండల తయారీకి ఉపయోగించే మట్టి నీటిని సహజంగా ఫిల్టర్ చేస్తుంది. ఇందులో పోరస్ లక్షణాలు ఉండటం వల్ల మలినాలు తొలగించి తాగేందుకు అనుకూలంగా మార్చుతాయి.కుండల తయారీ మట్టిలో ఆల్కలీన్ లక్షణాలు ఉంటాయి.  ఇవి నీటిలో pH స్థాయిలను సమతుల్యం చేస్తాయి. ఆల్కలీన్ నీరు ఆరోగ్యానికి ఎంతో మంచిది. అంతేకాదు మన శరీరంలోనే జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. చర్మాన్ని తేమగా ఉంచుతుంది, పొట్టలో యాసిడ్ తగ్గేలా చేస్తుంది.

కుండను తయారు చేసే మట్టిలో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి నీటిలోకి వెళ్లి అదనపు పోషక ప్రయోజనాలను అందిస్తాయి.మట్టి కుండలో పోసిన నీరు వేడి వాతావరణంలో కూడా చల్లగా, తాజాగా ఉంచుతాయి.  ఈ నీటిని తాగితే వడదెబ్బ తగిలే అవకాశం తక్కువ. మట్టి కుండలకు చిన్న చిన్న కన్నాలు ఉంటాయి. ఈ కన్నాల నుంచి గాలి కుండలోపలికి వెళ్తుంది. తద్వారా లోపలి నీరు చల్లగా అవుతుంది.  నిజానికి రిఫ్రిజిరేటర్ వాటర్ చాలా మందికి గొంతు నొప్పిని కలిగిస్తాయి. కానీ మట్టి కుండలోని నీరు ఈ ప్రాబ్లమ్స్‌ నుంచి హీల్ చేస్తుంది. మండే ఎండల్లో ఆరోగ్యంగా ఉండేందుకు సాయపడుతుంది

ఇమ్యూనిటీ గుణం

మంటి కుండలో నీళ్లు పోసి తాగడం వల్ల నీళ్లలో సహాజ మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ కోల్పోకుండా శరీరానికి అందించి ఎనర్జీని అందిస్తాయి. కుండలో నీరు నిల్వ చేసినప్పుడు, ఇమ్యూనిటీ గుణాలను అధికంగా పెంచుతుంది. జలుబు, దగ్గు, ఆస్త్మాతో బాధపడే వాళ్లు కుండ నీళ్లు తాగడం వల్ల, ఆ సమస్యల నుంచి బయటపడొచ్చు. మట్టి కుండలోని నీళ్లు తాగడం వల్ల ముఖ్యంగా వేసవిలో వడదెబ్బకు దూరంగా ఉండొచ్చు. కుండలోని నీటితో ముఖం కడిగితే ఎండ నుండి మంచి ఆహ్లాదాన్ని ఇస్తుంది. అంతేకాదు.. మెటబాలిజం రేటునూ పెంచుతుంది.