మేడారంలో హెల్త్ క్యాంప్లు.. 24 గంటల పాటు వైద్యం

మేడారంలో హెల్త్ క్యాంప్లు.. 24 గంటల  పాటు వైద్యం

మేడారం జాతరకు భక్తులు క్యూ కట్టారు ఇప్పటికే 50 లక్షలకు పైగా మంది భక్తులు మేడారం దర్శించుకున్నారు. రేపటి నుంచి మేడారం మహాజాతర మొదలు కాబోతుండటంతో భక్తులు పోటెత్తనున్నారు. 

భక్తులకు ఎలాంటి ఇబ్బంది కల్గకుండా వైద్యఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేక  చర్యలు తీసుకుంటున్నారు. స్థానిక టీటీడీ కళ్యాణ మండపంలో 50 బెడ్స్​ దవాఖాన ఏర్పాటు చేశారు.  30 చోట్ల ఉచిత హెల్త్​క్యాంప్​లు నిర్వహిస్తున్నారు. భక్తులకు 24 గంటల పాటు వైద్య సౌకర్యం అందించనున్నారు. అన్ని చోట్లా కలిపి 150 మంది స్పెషలిస్టు డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉన్నారు. జాతర పరిసర ప్రాంతాల్లో 4 బెడ్స్​తో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఒక్కో చోట ముగ్గురు డాక్టర్లు అందుబాటులో ఉంటారు. డాక్టర్లు, ఏఎన్‌‌ఎంలు, పారామెడికల్‌‌ సిబ్బంది కలిపి రెండు వేల మందికి పైగా జాతరలో డ్యూటీలు నిర్వహిస్తారని డీఎంఅండ్‌‌హెచ్‌‌వో అప్పయ్య ప్రకటించారు. అత్యవసరంగా రోగులను తరలించేందుకు 108 అంబులెన్సులు ‌15 అందుబాటులో ఉంచారు. అలాగే టెంపరరీ బ్లడ్‌‌ బ్యాంక్‌‌ కూడా  ఏర్పాటు చేశారు. 

మహజాతర సందర్భంగా సరిపోయే  బెడ్స్,మెడిసిన్, ఇంజెక్షన్ లను అందుబాటులో ఉంచారు అధికారులు. జాతర సమయంలో ప్రతి రోజు 300 మందికి పైగా ఔట్ పేషంట్లకు ట్రీట్మెంట్ అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఫిడ్స్ , స్పృహ తప్పి పోవడం , ఆల్కహాల్ ఇంటాక్సిక్, తల గాయాలతో  హెల్త్ క్యాంపస్ కు వస్తున్నారు బాధితులు.ఎమర్జెన్సీ కేసులను ములుగు టౌన్ కు తరలిస్తున్నారు వైద్యులు. ఇతర ప్రాంతాల నుంచి భక్తులు  వస్తుండటంతో  భక్తులు తమ జాగ్రత్తలో  ఉండాలని సూచిస్తున్నారు వైద్యులు.  మేడారం  జాతర కోసం  రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. మౌలిక వసతులు, నిర్వహణ కోసం రూ.105 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. 

Also Read : మినీ మేడారం జాతరలో ఏర్పాట్లు పూర్తి