థర్డ్ వేవ్ రాకుండా అడ్డుకోవటం జనం చేతుల్లోనే

V6 Velugu Posted on Aug 03, 2021

డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో.. జనం జాగ్రత్తగా ఉండాలన్నారు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు. థర్డ్ వేవ్ రావటం అనేది జనం చేతుల్లోనే ఉందన్నారు. ఇంకా మనం సెకండ్ వేవ్ లోనే ఉన్నామని.. ఇంకా డెల్టా వేరియంట్ కొనసాగుతోదన్నారు. పొరుగు రాష్ట్రాల్లో కేసులు ఎక్కువగా ఉన్నందున.. జనం పండుగలు, సెలబ్రేషన్స్ కు దూరంగా ఉండాలన్నారు. ఇక వ్యాక్సిన్ 50శాతం లోపు కవరైన జిల్లాల్లో మొదటి డోస్ పై ఫోకస్ చేశామన్నారు. ప్రస్తుతం 10 లక్షల వరకు కోవిషిల్డ్ డోసులు ఉన్నాయని.. వ్యాక్సిన్ అయిపోతుందేమోనని భయపడాల్సిన అవసరం లేదంటున్నారు శ్రీనివాస్ రావు.

Tagged Health Director Srinivasa Rao, third wave, people, prevent

Latest Videos

Subscribe Now

More News