
ఫిట్నెస్ మీద అవేర్నెస్ తప్పక పెంచుకోవాల్సిన రోజులివి. కొవిడ్‌తో పోరాటానికి బాడీని రెడీగా ఉంచాలంటే వర్కవుట్స్ చేయాలి. సీరియస్‌గా ఎక్సర్సైజ్ చేయలేనివాళ్లు జుంబా డ్యాన్స్ లాంటివి ఫాలో అయితే బెటర్. ఫిట్నెస్ ప్రోగ్రామే అయినా, జుంబా ఒక రకంగా కొరియోగ్రఫీనే. ఇందులో 16 కోర్ స్టెప్స్ ఉంటాయి. వీటిని సల్సా, రెగెటాన్, మెరెంగు, కంబియా అనే 4 రకాల బేసిక్ రిథమ్స్ నుంచి ఫామ్ చేస్తారు.
జుంబా క్లాస్ ఒక గంట పాటు ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా లక్షమందికి పైగా జుంబా ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు. జుంబాలో పదిరకాల క్లాసులు ఉంటాయి. వాటిలో అవసరానికి తగినవి ఎంచుకోవచ్చు.
జుంబా గోల్డ్
సులువుగా చేసుకోవచ్చు. ఒత్తిడి తక్కువ. ఏజ్డ్ పర్సన్స్‌కు ఈ క్లాసులు బెటర్. చాలా వరకు కంఫర్ట్ మూమెంట్స్ ఉంటాయి. బాడీ ఫ్లెక్సిబిలిటీకి, మజిల్స్ కండిషన్ ఫిట్‌గా ఉంచడానికి ఇది బాగుంటుంది.
జుంబా ఇన్ సర్క్యూట్స్
ఇది కొంచెం హైలెవల్ ట్రైనింగ్. యూత్, మిడిల్ఏజ్ వాళ్లకు బాగుంటుంది. వర్కవుట్స్ హెవీగా ఉంటాయి. డంబెల్స్ లాంటివి హ్యాండిల్ చేయాలి. రిథమ్స్ ఫాలో అవుతూ స్టెప్స్ ఉంటాయి. బాడీ మెటబాలిజం బాగా మెరుగవుతుంది. స్ట్రెంత్ బాగా పెరుగుతుంది.
జుంబా స్టెప్
బాడీ వెయిట్ తగ్గించుకోవాలని అనుకునేవాళ్లకు ఇది బెస్ట్ ఛాయిస్. కాళ్లు, తొడలు, పిరుదుల్లో ఉన్న కొవ్వు తగ్గించుకోడానికి ఇందులో స్టెప్స్ ఉంటాయి. స్టెప్ ఏరోబిక్స్ని మిక్స్ చేసి జుంబాలో ప్రెజెంట్ చేయడం వలన ఫన్ కూడా ఉంటుంది. రిలీఫ్‌గా అనిపిస్తుంది.
ఆక్వా జుంబా
స్విమ్మింగ్ పూల్‌లో చేసే ఆక్వాజుంబా ప్రత్యేకమైనది. జాయింట్ పెయిన్స్ ఉన్నవాళ్లు దీన్ని ప్రిఫర్ చేయొచ్చు. నీటిలో ఎక్సర్సైజ్ చేయడం వల్ల బాడీ ఫ్రిక్షన్కు గురవ్వదు. దాంతో ఫిట్నెస్ పెంచుకోవడం సులభం అవుతుంది. నిజానికి ఇందులో స్టెప్స్ వేయడం కొద్దిగా ఛాలెంజింగ్‌గానే ఉంటుంది. సరదాగానూ ఉంటుంది.
జుంబా సెంటావో
వెయిట్స్ లాంటివి ఏవీ వాడకుండా మజిల్స్ పెంచుకునేందుకు జుంబా సెంటావో బాగా యూజ్ అవుతుంది. ఇది కొంచెం సీరియస్‌గానే చేయాలి. ఒక ఛైర్‌ను పట్టుకుని రకరకాలుగా స్టెప్స్ వేయడం ఇందులో స్పెషల్.
జుంబా గోల్డ్ టోనింగ్
ఇది కూడా ఏజ్డ్ పర్సన్స్ కోసమే. అయితే ఇందులో లైట్ వెయిట్ యాక్టివిటీ ఉంటుంది. మజిల్ కండిషన్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. బాడీ స్ట్రెంత్ పెంచుకోవడానికి కొద్దిగా ట్రై చేస్తారు.
జుంబా టోనింగ్
బాడీ మజిల్స్ ఫిట్నెస్ పెంచడమే దీని ఉద్దేశం. చిన్న చిన్న పనులకు బాడీ అలసిపోకుండా ఉండేందుకు ఈ క్లాస్ బాగా ఉపయోగపడుతుంది. చేతులు, భుజాలు, నడుము దగ్గర మజిల్స్ బలంగా అవుతాయి.
జుంబా.. వరల్డ్ బ్రాండెడ్ ఫిట్నెస్ ప్రోగ్రామ్స్‌లో అతి పెద్దది. 1990లో కొలంబియన్ కొరియోగ్రాఫర్ ఆల్బర్టో బెటో పెరెజ్ దీన్ని స్టార్ట్ చేశాడు. దీని క్రేజ్‌కి 2001లో అఫీషియల్‌గా జుంబా బ్రాండ్ పేరుతో వీడియోలు రిలీజ్ చేయడం మొదలైంది. ఆ తర్వాత చాలామంది జుంబాను ఫాలో అవుతూ ఫిట్నెస్ క్లాసులు పెట్టారు.