జోగిపేట, వెలుగు: వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మంగళవారం జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా బాలింతల వార్డుకు వెళ్లి పరిశీలించారు. అనంతరం హాస్పిటల్లో తిరుగుతూ వైద్యుల గదికి చేరుకున్నారు. జూనియర్ డాక్టర్ సంతోష్ ఒక్కడే ఉండడంతో డీసీహెచ్ఎస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొంత కాలంగా వైద్యులు గైర్హాజరు అవుతుండడంతో జోగిపేట హాస్పిటల్ మారార అంటూ ఫోన్లో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తీరు మార్చుకోకుంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గైర్హాజరు అయిన వారిని సస్పండ్ చేయాలని అధికారులను ఆదేశించారు.
