
హైదరాబాద్, వెలుగు: గర్భిణులకు అందజేస్తున్న కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లలో పల్లి పట్టీని కూడా యాడ్ చేయాలని హెల్త్ మినిస్టర్ హరీశ్‌రావు నిర్ణయించారు. 3 రోజుల క్రితం మంత్రి హరీశ్‌రావు సిర్పూర్‌లోని గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమానికి వచ్చిన సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప .. కిట్లలో ఉన్న వస్తువులకు అదనంగా పల్లి పట్టీని కూడా చేర్చాలని మంత్రి హరీశ్‌కు సూచించారు. గర్భిణులు రక్త హీనత సమస్యను అధిగమించేందుకు తాను బెల్లం పల్లిపట్టీలను పంపిణీ చేస్తున్నానని, అవి సత్ఫలితాలను ఇస్తున్నాయని వివరించారు. స్పందించిన హరీశ్ కిట్లలో పల్లి పట్టీని చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.