Meenakshi Chaudhary: నాగవంశీ ‘సితార’బ్యానర్లో.. బ్యూటీ మీనాక్షికి వరుస ఆఫర్లు.. కొత్త సినిమా విశేషాలివే

Meenakshi Chaudhary: నాగవంశీ ‘సితార’బ్యానర్లో.. బ్యూటీ మీనాక్షికి వరుస ఆఫర్లు.. కొత్త సినిమా విశేషాలివే

సినిమాలో హీరో ఎవరనేది ముఖ్యం కాదని, తన దృష్టిలో కథే హీరో అని  చెప్పింది మీనాక్షి చౌదరి. నవీన్ పొలిశెట్టికి జంటగా ఆమె నటించిన చిత్రం ‘అనగనగా ఒకరాజు’.  మారి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మీనాక్షి చౌదరి చెప్పిన  విశేషాలు.

‘‘ఇదొక కంప్లీట్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్. నన్ను పూర్తి కామెడీ పాత్రలో చూడబోతున్నారు. ఇందులో నా పాత్ర పేరు చారులత.  సంపన్న కుటుంబంలో పుట్టిన  గారాలపట్టి లాంటి పాత్ర.  ఇంట్లో యువరాణిలా పెరుగుతుంది. అమాయకంగా, సున్నితమైన మనసు కలిగి ఉంటుంది. నా నిజ జీవిత పాత్రకు పూర్తి భిన్నంగా ఈ పాత్రను చేశా. బయట నేను ప్రాక్టికల్‌‌‌‌గా ఉంటే,  చారులత పాత్ర మాత్రం ఎమోషనల్, సెన్సిటివ్‌‌‌‌గా ఉంటుంది.  నటిగా నన్ను మరో కోణంలో చూపించే పాత్ర ఇది.  ఇందులో టైమింగ్  చాలా ముఖ్యం. పంచ్ డైలాగ్స్‌‌‌‌ని కరెక్ట్ టైమ్‌‌‌‌లో చెప్పడం  ఛాలెంజింగ్‌‌‌‌గా అనిపించింది.

ఇప్పటివరకు నేను చేసిన పాత్రల్లో ఇదే ఎక్కువ ఛాలెంజింగ్ అని చెప్పవచ్చు. కామెడీ అనేది చాలా కష్టం. పైగా ఇందులో కామెడీ కొత్తగా ఉంటుంది.  నవీన్‌తో  వర్క్ చేయడం అనేది.. సినిమా టీచింగ్ స్కూల్‌‌‌‌లా ఉంది. ఆయన పర్ఫెక్ట్ టైమింగ్ ఉన్న యాక్టర్. తనతో వర్క్ చాలా సరదాగా ఉంటుంది. ఈ మూవీ షూటింగ్ అధికభాగం గోదావరి ప్రాంతంలో జరిగింది. అక్కడి ప్రజలు  సినిమా అంటే ప్రత్యేక అభిమానం చూపిస్తుంటారు. ఆ ప్రాంతంలో షూటింగ్ అనుభూతిని ఎప్పటికీ మరిచిపోలేను.

దర్శకుడు మారి నూతన దర్శకుడు అయినప్పటికీ, ఫుల్ క్లారిటీ ఉంది. ఏదైనా సన్నివేశంలో ఎక్కువ టేక్స్ తీసుకున్నా.. ఆయన విసుక్కోరు. ఓపికగా ఉంటూ నటీనటుల నుంచి మంచి నటన రాబట్టుకున్నారు. సితార బ్యానర్‌‌‌‌‌‌‌‌లో ఇది నా మూడో సినిమా. ఆ సంస్థ నుంచి నాకు వరుసగా ఆసక్తికర సినిమాలు రావడం అదృష్టంగా భావిస్తున్నా.

ఇక ప్రస్తుతం నాగ చైతన్యతో ‘వృషకర్మ’ సినిమా చేస్తున్నా. మరికొన్ని కథలు లైనప్‌లో ఉన్నాయి. ఆ చిత్రాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు త్వరలో వస్తాయి’’. అని మీనాక్షి తెలిపింది. గతంలో గుంటూరు కారం, లక్కీ భాస్కర్, ఇప్పుడు అనగనగా రాజు వంటి సినిమాలు సితార బ్యానర్లో చేసింది