డాక్టర్లపై దాడి చేస్తే కఠినంగా శిక్షించాలి : కేంద్రం

డాక్టర్లపై దాడి చేస్తే కఠినంగా శిక్షించాలి : కేంద్రం

వెస్ట్ బెంగాల్ లో డాక్టర్లపై దాడి సంఘటన దేశమంతటా అలజడి రేపుతుండటంతో కేంద్రం దిద్దుబాటు చర్యలకు దిగింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్ధన్ లెటర్ రాశారు. డాక్టర్లపై ఎవరు దాడులు చేసినా.. వెంటనే ప్రభుత్వాలు, పోలీసులు అప్రమత్తం కావాలని సూచించారు. డాక్టర్లపై దాడులు చేస్తే కఠినంగా శిక్షించాలని సూచించారు.

ఓ వృద్ధుడి మృతికి నిరసనగా… శనివారం రోజున కోల్ కతాలోని NRS మెడికల్ కాలేజ్, ఆస్పత్రిలో ఇద్దరు డాక్టర్లపై 200 మంది దాడి చేశారు. ఇద్దరు డాక్టర్లకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనకు నిరసనగా.. వారం రోజులుగా జూనియర్ డాక్టర్లు ఆందోళనకు చేస్తున్నారు. వెస్ట్ బెంగాల్ లో ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆస్పత్రులు, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ వార్డులు, ఓపీ సేవలు, పాథోలాజికల్ యూనిట్లలో సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. డాక్టర్ల ఆందోళన.. దేశమంతటికీ విస్తరించింది. జూన్ 17న దేశవ్యాప్త సమ్మెను ప్రకటించారు. ఈ సమ్మెకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా మద్దతు ప్రకటించింది. దీంతో.. కేంద్ర ఆరోగ్య శాఖ స్పందించింది.