జంపాలనగర్ కు వైద్యాధికారులు

జంపాలనగర్ కు వైద్యాధికారులు

కొణిజర్ల, వెలుగు: మండలంలోని మెకాలకుంట పంచాయతీ పరిధిలోని జంపాలనగర్​లో కిడ్నీ బాధితులపై శుక్రవారం ‘వీ6, వెలుగు’లో ప్రచురితమైన కథనానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పందించారు. డీఎంహెచ్వో రామారావు, డిప్యూటీ డీఎంహెచ్వో వేణుమాధవరావు గ్రామాన్ని సందర్శించి, పరిస్థితిని పరిశీలించారు. వారి ఆదేశాల మేరకు కొణిజర్ల పీహెచ్‌‌‌‌‌‌‌‌సీ వైద్య సిబ్బంది ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి సుమారు 40 మంది గ్రామస్తులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. 

కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారి వైద్య నివేదికలను పరిశీలించి తగిన సూచనలు అందించారు. తాగునీటి నమూనాలను సేకరించి పరీక్షల కోసం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కు పంపించారు. నివేదికలు వచ్చిన అనంతరం తదుపరి చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు. అలాగే ఆర్‌‌‌‌‌‌‌‌డబ్ల్యూఎస్ అధికారులు గ్రామంలో నీటి వనరులను పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్ భూక్యా అనిత, సీహెచ్‌‌‌‌‌‌‌‌వో రాజేశ్వరి, హెచ్‌‌‌‌‌‌‌‌ఈవో వెంకటరెడ్డి, కొణిజర్ల పీహెచ్‌‌‌‌‌‌‌‌సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మౌనికాశృతి తదితరులు పాల్గొన్నారు.