నడుము లోతు నీళ్లలో బెస్ట్ ఎక్సర్​సైజ్​

నడుము లోతు నీళ్లలో బెస్ట్ ఎక్సర్​సైజ్​

ఆక్వా ఏరోబిక్స్.. ఎంజాయ్​ చేస్తూ ఫిట్​నెస్​ పెంచుకునే బెస్ట్​ ఛాయిస్​. హ్యాపీగా నడుము లోతు నీళ్లలో నిలుచుని స్లోగా ఏరోబిక్​ ఎక్సర్​సైజ్​ చేయడమే ఆక్వా ఏరోబిక్స్​. వీటి కోసం ప్రత్యేకంగా క్లాసులు కూడా ఉన్నాయి. లైట్ మ్యూజిక్​ పెట్టుకుని గ్రూప్​గా చేసుకునే ఆక్వా ఏరోబిక్స్​కి ఇటీవల క్రేజ్​ పెరుగుతోంది. ఆక్వా ఏరోబిక్స్​ను వాటర్​ ఏరోబిక్స్​ అని కూడా అంటారు. ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్​ చేస్తూ  స్విమింగ్​ పూల్​లో ప్రాక్టీస్​ చెయ్యొచ్చు. అయితే అంతకు ముందుగా వాటర్​ ఏరోబిక్స్​ క్లాసెస్​ అటెండ్​ అయితే బాగుంటుంది. అందులోని టెక్నిక్స్​, ప్రికాషన్స్​ తప్పనిసరిగా తెలుసుకోవాలి.

లాభాలేంటి?
ఏరోబిక్స్​ అంటే లైట్​ ఎక్సర్​సైజ్​. వామప్​కి నెక్స్ట్​ లెవెల్​. వాటర్​ బాడీకి బాగా సపోర్ట్ ఇస్తుంది. నీళ్లలో ఉన్నప్పుడు గ్రావిటీ, ఫ్రిక్షన్​ తక్కువగా ఉంటాయి. అందువల్ల ఎక్సర్​సైజ్​ చేసేటప్పుడు బోన్​ జాయింట్స్​ దగ్గర ఒత్తిడి తగ్గుతుంది. నీటిలో ఎక్సర్​సైజ్ చేసేటప్పుడు కండరాలు మరింత స్ట్రాంగ్​ అవుతాయి.  నీటిని ముందుకీ, వెనక్కీ నెట్టడం వల్ల భుజాల్లో పవర్ పెరుగుతుంది. నడుము, తొడ, భుజాల్లో కండరాలు గట్టిపడతాయి. ఆక్వా ఏరోబిక్స్​ హార్ట్ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం. బ్లడ్​ ప్రెజర్​ తగ్గిస్తుంది.  బ్లడ్​ సర్క్యులేషన్​ బాడీ మొత్తం ఒకేలా ఉండటానికి నీటిలో చేసే ఈ వ్యాయామం చాలా మంచిది.  బయట చేసే ఎక్సర్​సైజ్​ కన్నా వాటర్​లో కొంచెం ఎక్కువ సేపు చెయ్యొచ్చు. అలసట తక్కువగా ఉంటుంది. ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. సరైన బాడీ మాస్ ఇండెక్స్​ మెయిన్​టెయిన్​ చేయడానికి ఇలాంటి ఎక్సర్​సైజులు మంచివి.  లంగ్స్​ కెపాసిటీ కూడా పెంచుకోవచ్చు. మజిల్ స్ట్రెంత్​, బాడీ ఫ్లెక్సిబిలిటీ పెంచడానికి ఏరోబిక్​ థెరపీని ప్రిఫర్​ చేస్తున్నారు. ఆక్వా ఏరోబిక్స్​తో పాటు ఆక్వా సైక్లింగ్​, ఆక్వా జాగింగ్, ఆక్వా పోలో వంటివి చేస్తుంటే ఎంకరేజింగ్​గా ఉంటాయి. ఆక్వా ఏరోబిక్​ లొకేషన్​ మూడ్ వల్ల స్ట్రెస్, యాంగ్జయిటీ వంటి సమస్యలు తగ్గుతాయి. క్యాలరీలు కరిగి, బాడీ ఫ్యాట్​ బాగా తగ్గుతుంది.