జీరా నీళ్లతో జీర్ణం ఈజీ

జీరా నీళ్లతో జీర్ణం ఈజీ

చాలామంది కనిపించిన ఫుడ్డల్లా పొట్టలో వేసేస్తుంటారు. కానీ అది ఎలా జీర్ణమవుతుందో మాత్రం పట్టించుకోరు. కనీసం అసలు అది త్వరగా డైజెషన్ అయ్యే ఫుడ్డో కాదో కూడా చూడరు. దానివల్ల డైజేషన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అయితే జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచే వాటిలో జీరా వాటర్ ఒకటి. దీనిలో జీర్ణాశయానికి మేలు చేసే ఎన్నో పోషకాలున్నాయి. ఇవి డైజెషన్ ప్రాబ్లమ్స్ తగ్గించడంతో పాటు బాడీని ఎప్పుడూ కూల్ గా ఉంచుతాయి.

జీలకర్రలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వ్యాధినిరోధక శక్తిని పెరుగుతుంది.

మహిళలను పీరియడ్స్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేస్తుంది. పీరియడ్స్ ప్రతీ నెల వచ్చేలా చేస్తుంది.

డైలీ జీలకర్ర, ఉప్పు కలిపి తింటే మలబద్ధకం పోతుంది.

జీరా నీళ్లు రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే డయాబెటీస్ కంట్రోల్ లో ఉంటుంది.

జీరా ఒక ఇన్​ఫ్లమెటరీ మెడిసిన్. ఆస్తమాతో బాధపడే వారికి ఇది బాగా సహాయపడుతుంది.

ఐరన్ పుష్కలంగా ఉంటుంది. హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గించుకోవాలంటే రెగ్యులర్ డైట్ లో జీలకర్ర ఉండాలి.

ప్రతీరోజూ జీలకర్రను తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగు పడుతుంది. డైజెషన్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి.

జీరా నీళ్లు చర్మంపై ముడతలు రాకుండా నివారిస్తాయి.

వికారం, వాంతులున్నా జీరా నీళ్లు మెరుగ్గా పనిచేస్తాయి.

జీరా నీళ్ల తయారీ విధానం

జీలకర్రను పెనం మీద వాసన వచ్చేంత వరకూ వేగించాలి. తరువాత పుదీనా ఆకులు, నీళ్లు పోసి సన్నని మంటమీద పది నుంచి పదిహేను నిమిషాలు మరిగించాలి. మిక్సీలో ఈ వాటర్‌ వేసి పూర్తిగా కలిసేలా బ్లెండ్‌ చేయాలి. ఇప్పుడు పొడవాటి గ్లాసు తీసుకొని జీరా నీళ్లు పోయాలి. అందులో బ్లాక్‌ సాల్ట్‌, నిమ్మరసం, తేనె లేదా పంచదార వేసి బాగా కలపాలి. వీటిని డైరెక్ట్ గా తాగాలనుకుంటే తాగొచ్చు. లేదా సోడాతో కలిపి అయినా తాగొచ్చు.