సిగరెట్ తాగేవాళ్లను చూడండి.. 'మానొచ్చు కదా !' అని ఎన్నిసార్లు చెప్పినా మానరు. అలాగే మందుకి అలవాటయిన వాళ్లు కూడా. 'మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం' అని ఎక్కడ చూసినా బోర్డులు కనిపిస్తాయి. అయినా సరే, వీటిని మానమంటే అస్సలు మానరు. సిగరెట్ లో నికొటిన్ అనే డ్రగ్ ఉంటుంది. పొగ పీల్చగానే ఈ డ్రగ్ ఎనర్జీని తీసుకొచ్చి ఇస్తుంది, ఆ వెంటనే రిలాక్సింగ్ ఉంటుంది.
ఇదొక అడిక్షన్ ప్రాసెస్.మెల్లగా తనవైపు మళ్లించుకుంటుంది. సిగరెట్. ఎంత ప్రయత్నించినా మానలేరు ఎందుకంటే, ఇందుకే. ఆల్కహాల్ కూడా ఇలాంటిదే. డిప్రెసెంట్గా పనిచేస్తుంది. ఆల్కహాల్. పడుకునే ముందు చాలామంది ఆల్కహాల్ తీసుకునేది అందుకే. అయితే సమస్య అంతా ఈ రెండూ ఆరోగ్యానికి మంచివి కాకపోవడమే.
ALSO READ : లైఫ్ ఇన్సూరెన్స్ కొంటున్నారా..?
శరీరంలోని అన్ని అవయవాలను పాడు చేయగలవు సిగరెట్, ఆల్కహాల్. ముఖ్యంగా ఆల్కహాల్ మనిషిని మనిషిలా ఉంచదు. శరీరం మీద అదుపు కోల్పోయేలా చేస్తుంది. ఏం చేస్తున్నారో తెలియదు. హత్య, అత్యాచారం లాంటి నేరాలు జరిగినప్పుడు నిందితులు చాలావరకు ఆల్కహాల్ తీసుకొని ఉంటారు. అంత విచక్షణ లేకుండా చేస్తుందిది. 'ఇంత జరుగుతున్నా ప్రభుత్వాలు వీటిని ఎందుకు బ్యాన్ చెయ్యవు?” అన్నది ప్రపంచవ్యాప్తంగా తరచూ జనం మాటల్లో వినిపించే ఒక ప్రశ్న.
