బ్రేక్‌ఫాస్ట్ లేదా శ్నాక్గా తక్కువ టైంలో తయారు చేయగలిగే ఫుడ్ పోహా. దొడ్డు అటుకులతో చేసిన పోహా బ్రేక్‌ఫాస్ట్‌గా బాగుంటుంది. ‘అటుకుల ఉప్మా’ అని పిలిచే దీనిలో ఫైబర్ ఉంటుంది. తొందరగా శక్తినివ్వడమే కాకుండా ఈజీగా అరుగుతుంది కూడా. అందుకని బరువు తగ్గాలి అనుకునేవాళ్ల డైట్లో పోహా కచ్చితంగా ఉండాలి అంటున్నారు న్యూట్రిషనిస్ట్లు.
పోహ తింటే...
వంద గ్రాముల పోహలో 3.3గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇందులో ఐరన్ కూడా ఎక్కువే. ఎర్రరక్తకణాల తయారీకి ఐరన్ చాలా అవసరం. పోహాలోని ప్రొబయాటిక్స్ పొట్టలో మంచి బ్యాక్టీరియా పెరగడానికి సాయపడతాయి. దీనిలో గ్లుటెన్ ఉండదు. అంతేకాదు పోహాలో క్యాలరీలు తక్కువ. దాంతో బ్రేక్‌ఫాస్ట్‌గా పోహా తింటే ఈజీగా బరువు తగ్గుతారు.
