ఆర్జీవీ వ్యూహం సినిమాపై విచారణ వాయిదా

ఆర్జీవీ వ్యూహం సినిమాపై విచారణ వాయిదా

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కి్ంచిన వ్యూహం సినిమాపై విచారణ వాయిదా పడింది.  ఈ సినిమాకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వడంపై అభ్యంతరం తెలుపుతూ టీడీపీ నేత నారా లోకేష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దర్శకుడు  వర్మ.. తెలుగుదేశం పార్టీని, తమ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టేలా, తమ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యూహం సినిమా తీశారంటూ లోకేశ్‌  పిటిషన్‌లో పేర్కొన్నారు.  

దీనిపై డిసెంబర్ 26న న్యాయస్థానం  విచారణ చేపట్టింది.  సినిమా విడుదలకు స్టే ఇవ్వాలని పిటిషనర్ లాయర్ కోరగా అందుకు కోర్టు నిరాకరించింది.  తదుపరి విచారణను డిసెంబర్ 28కి వాయిదా వేసింది.  28న విచారణ చేపట్టాక స్టేపై నిర్ణయం వెల్లడిస్తామని తెలిపింది. 

 ఇక అంతకుముందే ఈ సినిమా విడుదలకు వారం రోజులు ఉందనగా రామ్ గోపాల్ వర్మకు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు షాకిచ్చి్ంది. ఈ సినిమాను ఓటీటీతో పాటు ఇతర ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లలో విడుదల చేయడాన్ని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ఈ సినిమా డిసెంబర్ 29న విడుదల కావాల్సి ఉంది.