కాన్పూర్‌లో చ‌లి తీవ్రతకు 25 మంది బలి

కాన్పూర్‌లో చ‌లి తీవ్రతకు 25 మంది బలి

కాన్పూర్‌లో గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్తో 25 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా చ‌లి తీవ్రత రోజు రోజు పెరుగుతోంది. చాలా ప్రాంతాల్లో క‌నిష్ట ఉష్ణోగ్రత‌లు రికార్డులు స్థాయిలో పడిపోతున్నాయి. తాజాగా చలి తీవ్రత కారణంగా ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో 25 మంది చనిపోయారు. కొందరు గుండెపోటు, మరి కొందరు బ్రెయిన్ స్ట్రోక్‌ వచ్చి ప్రాణాలు కొల్పోయారు. వీరిలో 17 మంది వైద్య సహాయం అందక ముందే చనిపోయారు. అయితే జలుబులో ఒక్కసారిగా రక్తపోటు పెరిగి రక్తం గడ్డకట్టడం వల్ల గుండెపోటు, బ్రెయిన్ ఎటాక్ అవుతుందని వైద్యులు చెబుతున్నారు.

‘చల్లని వాతావరణంలో గుండెపోటు వృద్ధులకు మాత్రమే పరిమితం కాదు. యుక్తవయసులో ఉన్న వారు కూడా గుండెపోటుకు గురైన సందర్భాలు ఉన్నాయ లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీ (KGMU)కి చెందిన అధ్యాపకుడు వెల్లడించారు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ వెచ్చటి వాతావరణంలో ఉండాలని.. వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలి’ అని సూచించారు. కాగా, కార్డియాలజీ ఇనిస్టిట్యూట్ కంట్రోల్ రూం తెలిపిన వివరాల ప్రకారం, నిన్న 723 మంది హృద్రోగులు అత్యవసర, ఓపీడీకి వచ్చారని.. దీనికి చ‌లి తీవ్రత పెర‌గ‌డం, ఉష్ణోగ్రత‌లు త‌గ్గిపోవ‌డ‌మే కార‌ణమని వైద్యులు చెబుతున్నారు.