Heart attack:ఉదయం వేళల్లో గుండెపోటు ప్రమాదం ఎక్కువట..కార్డియాలజిస్టులు ఏం చెబుతున్నారంటే..

Heart attack:ఉదయం వేళల్లో గుండెపోటు ప్రమాదం ఎక్కువట..కార్డియాలజిస్టులు ఏం చెబుతున్నారంటే..

ఇటీవల కాలంలో గుండెపోటుతో మరణాలు ఎక్కువవుతుండటం, చిన్న పిల్లలనుంచి వృద్ధుల వరకు వయసుతో సంబంధం లేకుండా కార్డియాక్ అరెస్ట్ తో మృత్యువాత పడటం ఆందోళన కలిగిస్తుంది. ఆటలాడుతూ ఒకరు, జిమ్ లో వర్కవుట్ చేస్తూ మరొకరు.. రన్నింగ్ చేస్తూ, తింటూ కొందరు ఇలా గుండెపోటుతో చనిపోతున్నారు. ఈ మరణాల్లో ఎక్కువ మంది ఉదయం వేళల్లో జరిగినవే అని డాక్టర్లు చెబుతున్నారు. ఉదయం పూట కార్డియాక్ అరెస్ట్ లకు కారణం ఏంటీ.. కార్డియాలజిస్టులు ఏం చెబుతున్నారు?

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం..2022 లో 19.8 మిలియన్ల మంది గుండె సంబంధ వ్యాధులతో చనిపోయారు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగిన మొత్తం మరణాలలో దాదాపు 32శాతం. వీటిలో 85వాతం మరణాలు గుండెపోటు ,స్ట్రోక్ కారణంగా సంభవించాయి. గుండెకు రక్తం,ఆక్సిజన్‌ను పంపే ధమనిలో అడ్డంకులు ఏర్పడినప్పుడు గుండెపోటు సంభవిస్తుంది.

 గుండెపోటు వివిధ కారణాల వల్ల జరగవచ్చు. గుండెపోటుకు ప్రధాన కారణాలలో ఒకటి ఒత్తిడి కాదని, గుండెపోటుకు ఒక ప్రధాన కారణమని కార్డియాలజిస్ట్ డాక్టర్లు అంటున్నారు. ఉదయం వేళల్లో గుండెపోటు ప్రమాదాలు ఎక్కువ అని చెబుతున్నారు. ఉదయం వేళల్లో శరీరం సహజ ప్రతిస్పందనకు మేల్కోనే సమయంలో గుండెపై వత్తిడి పడుతుందంటున్నారు డాక్టర్లు. మీరు మేల్కొన్నప్పుడు శరీరం కార్టిసాల్‌లో పెరుగుదలను ప్రేరేపిస్తుంది..ప్లేట్‌లెట్లు అంటుకుంటాయి.రక్తపోటు పెరుగుతుంది.

నిద్ర లేచిన 0-నుంచి 100 సెకన్లలో కార్డియాక్ అరెస్ట్ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, ముఖ్యంగా ఉదయం 7 గంటలనుంచి 11 గంటల మధ్య కాలంలో ఇది ఎక్కువ అని డాక్టర్లు చెబుతున్నారు. అదేవిధంగా సాయంత్రం 5గంటలనుంచి 6 గంటల మధ్య లో కూడా గుండెపోటు ప్రమాదం ఉందని అంటున్నారు. 

చాలా గుండెపోటులు కార్టిసాల్ పెరుగుదల, ప్లేట్‌లెట్ అంటు పెరగడం,రక్తపోటు పెరుగుదల గుండెపోటు ,ఆకస్మిక గుండె మరణాల ప్రమాదాన్ని పెంచుతుందని డాక్టర్లు చెబుతున్నారు.

డాక్టర్ల వార్నింగ్.. మీ ప్రమాదాన్ని పెంచే ఉదయం అలవాట్లు 

గుండెను రక్షించడంలో,హృదయ సంబంధ సంఘటనల ప్రమాదాలను తగ్గించడంలో మీకు సహాయపడే సున్నితమైన ఉదయం దినచర్యను అవలంబించాలని డాక్టర్లు నొక్కి చెబుతున్నారు. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మేల్కొన్న వెంటనే చేయవలసిన ,చేయకూడని కొన్ని విషయాలను సూచించారు. 

మీరు మేల్కొన్న వెంటనే ఇవి చేయకూడదంటున్నారు డాక్టర్లు. ఖాళీ కడుపుతో కాఫీ తాగడం, హైడ్రేషన్ చేయకపోవడం, లేచిన వెంటనే మందులు వేసుకోవద్దు.  వెంటనే పనిలోకి దిగడం మానేయాలి..ఇది - మీ గుండెకు అత్యంత రక్షణ అవసరమైన సమయం అదే. అని అంటున్నారు డాక్టర్లు. 

లేచిన వెంటనే ముందుగా నీళ్లు తాగాలి. ఆ తర్వాత మీ మందులను సమయానికి తీసుకోవాలి.ప్రోటీన్-ఫార్వర్డ్ అల్పాహారం తినాలి. లేవగానే 10–15 నిమిషాలు తేలికపాటి కదలికను మీ శరీరానికి ఇవ్వాలి. ఇవి మీ గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయంటున్నారు డాక్టర్లు.