కారు రిపేర్ చేస్తుండగా గుండెపోటు.. మెకానిక్ స్పాట్ డెడ్

కారు రిపేర్ చేస్తుండగా గుండెపోటు.. మెకానిక్ స్పాట్  డెడ్

ఈ మధ్యకాలంలో గుండెపోటు మరణాలు బాగా పెరిగిపోయాయి. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి. చిన్న పిల్లలు మొదులుకొని పెద్ద వయస్సు కలిగిన వారు గుండెపోటుతో మరణిస్తున్నారు.  

అప్పటివరకు బాగున్న మనుషులు ఎక్కడ చూసినా క్షణాల్లో కుప్పకూలడం, ఆపై ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో కంటే చాలా ఎక్కువగా, సడన్ గా వస్తున్న గుండెపోటులపై ప్రతి ఒక్కరిలోనూ భయాందోళన కలుగుతోంది. 

తాజాగా కారు రిపేర్ చేస్తూ ఓ మెకానిక్ గుండెపోటుతో  కుప్పకూలిపోయాడు. ఈ ఘటన వనస్థలిపురంలోని  హ్యుందాయ్ షోరూంలో చోటుచేసుకుంది. అందులో మెకానిక్ గా పనిచేస్తున్న జంగారెడ్డి (36) కారు రిపేర్ చేస్తుండగా ఒక్కసారిగా అతనికి హార్ట్ స్ట్రోక్ట్ వచ్చింది.  దీంతో కింద పడిపోయాడు. 

జంగారెడ్డికి ఏమైందో తెలియక పక్కన ఉన్న స్టాప్  షాక్ కు గురయ్యారు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే జంగారెడ్డి  చనిపోయినట్లుగా వైద్యలు నిర్ధారించారు.  దీనికి సంబంధించిన  దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.