హృదయాన్ని కదిలించే ఘటన: లీవ్ ఇవ్వకపోవడంతో..కానిస్టేబుల్ భార్య,బిడ్డ మృతి

హృదయాన్ని కదిలించే ఘటన: లీవ్ ఇవ్వకపోవడంతో..కానిస్టేబుల్ భార్య,బిడ్డ మృతి

ఉత్తరప్రదేశ్ లో హృదయాన్ని కదిలించే ఘటన చోటు చేసుకుంది. సకాలంలో వైద్యం అందక కానిస్టేబుల్ భార్య, బిడ్డ మృతి చెందారు. అందరిని కంటతడిపెట్టించే ఈ ఘటనకు సంబంధించిన కానిస్టేబుల్ భార్య, బిడ్డలు విగతజీవులుగా పడివున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతన్నాయి. 

మొయిన్ పురికి చెందిన ఓ పోలీస్ కానిస్టేబుల్ జలౌన్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నాడు. తన భార్య, బిడ్డలు అనారోగ్యం ఉన్నారు.. సెలవులు ఇవ్వాలని ఉన్నతాధికారులను కోరారు. అయితే ఎస్ వో అర్జున్ సింగ్ మెడికల్ లీవ్ నిరాకరించారు. కొద్దిరోజులకే సరైన వైద్యం అందక మెయిన్ పురిలో కానిస్టేబుల్ భార్య, బిడ్డ మృతి చెందారని కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేప్టట్టారు. 

స్థానిక మీడియాలో ఈ హృదయ విదారక ఘటనకు సంబందించి కథనాలు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మరణించిన కానిస్టేబుల్ భార్య, బిడ్డ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విగతజీవులుగా పడి ఉన్న వారి ఫొటోలు అందరని కంటతడి పెట్టించాయి. ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెడికల్ ఎమర్జెన్సీ విషయంలో కూడా కానిస్టేబుల్ కు సెలవు ఇవ్వకపోవడంపై మండిపడుతున్నారు. 

మెడికల్ లీవులు ఇస్తే తన భార్య బిడ్డలకు మెరుగైన చికిత్సకోసం తరలించాలని కానిస్టేబుల్ అనుకున్నాడు. అయితే లీవ్ పర్మిషన్ ను రాంపుర ఎస్వో తిరస్కరిం చారు. బలమైన కారణాలున్నప్పటికీ కానిస్టేబుల్ కు సెలవు నిరాకరించిన ఎస్ వోపై చర్యలు తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు.