హార్ట్ బ్రేకింగ్ సీసీఫుటేజ్..ఇరుకైన కాలనీలు, గల్లీలు.. ఎదురుగా ఇద్దరు మనుషులు వస్తేనే నడవడం కష్టం.. అలాంటిది భారీ వాహనాలకు ఎంట్రీ ఎంత ప్రమాదమో ఈ వీడియోలోని దృశ్యాలే ఉదాహరణ. ఎక్కడ జరిగిందో తెలియదు గానీ.. ఇరుకైన గల్లీలో వెళ్తున్న వాటర్ ట్యాంకర్ కింద పడి బాలుడు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్రాక్టర్లు, నీటి ట్యాంకర్లు, ట్రక్కులు ఇరుకైన వీధుల్లోకి వచ్చినప్పుడు చిన్న పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతోంది.
వైరల్ వీడియోలో ఇరుకైన గల్లీలో వాటర్ ట్యాంకర్ వెళ్తుండగా పక్కనే నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గురు బాలురు కుక్కను చూసి భయపడి వెనక్కి జరిగారు. అంతే ట్రాక్టర్ తొట్టి భాగం టైర్ల కిందపడి నలిగిపోయాడు ఓ బాలుడు. తీవ్ర గాయాలతో బాలుడు గిలగిలా కొట్టుకుంటున్న దృశ్యాలు సీసీ ఫుటేజ్ లో రికార్డయ్యాయి. చూస్తుండగానే క్షణాల్లో ఇదంతా జరిగిపోయింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన బాలుడిని ఆస్పత్రికి తరలించారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఇలాంటి ప్రమాదాలపై సీరియస్ చర్చ పెట్టారు. వాహనాల దగ్గర పిల్లలను చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి.. భారీ వాహనాలకు వెనక ఉన్న పరిసరాలు కనిపించవు.. డ్రైవర్లు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని డ్రైవ్ చేయాలి.. ఒక్క క్షణం జీవితాలను శాశ్వతంగా మార్చేయగలదు అంటూ కామెంట్లు పెట్టారు.
⚠️ URGENT SAFETY WARNING ⚠️
— Rajneeti Tadka 🌶️ (@RajneetiTadka) May 30, 2026
This deeply heartbreaking footage is a harsh and devastating reminder of the extreme dangers heavy vehicles pose in tight residential spaces.
Small children are incredibly vulnerable and easily fall into the blind spots of tractors, water tankers,… pic.twitter.com/3hCxLKmOBc
