దేశవ్యాప్తంగా హీట్ వేవ్స్..రెండు రోజుల్లో 54 మంది మృతి 

దేశవ్యాప్తంగా హీట్ వేవ్స్..రెండు రోజుల్లో 54 మంది మృతి 

భానుడు భగభగ మండిపోతున్నాడు. ఉదయం 9 గంటలు దాటిందో లేదో నిప్పులు కురిపిస్తున్నాడు. సూర్య ప్రతాపానికి దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఈసారి గరిష్ట ఉష్ణోగ్రత 50 డిగ్రీలను తాకింది. తక్కువల తక్కువ 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతోంది.  దీంతో దేశవ్యాప్తంగా హీట్ వేవ్స్ బీభత్సం సృష్టిస్తున్నాయి. తీవ్రమైన వేడి గాలులకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. గడిచిన రెండు రోజుల్లో హీట్ వేవ్స్ దేశవ్యాప్తంగా 54మంది మృతి చెందారు. చెరు వులు, కుంటలు, జలాశయాల్లో నీరు అడుగంటుతోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు రెడ్ అలెర్ట్ ప్రకటించాయి. 

45 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఢిల్లీతో సహా అనేక ప్రదేశాలతో మధ్య, తూర్పు, ఉత్తర భారతదేశంలో తీవ్రమైన హీట్‌వేవ్ కొన సాగడంతో కనీసం 54 మంది మరణించారు. మే 31, జూన్1 మధ్య ఉత్తరప్రదేశ్‌లో, మే 31న హర్యానా, చండీగఢ్, ఢిల్లీలో డస్ట్ స్ట్రామ్ అంచనా వేస్తోంది వాతావరణ శాఖ. దీంతో పాటు వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉందని చెబుతోంది. 

గురువారం (మే 30) ఢిల్లీలో గరిష్టంగా 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కంటే 5.2 డిగ్రీలు ఎక్కువ. IMD డేటా ప్రకారం..దేశ రాజధానిలో 79 ఏళ్ల తర్వా త ఇది గరిష్ట ఉష్ణోగ్రత. 

ఇప్పటివరకు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో పెరుగుతున్న హీట్ వేవ్స్ కారణంగా దేశవ్యాప్తంగా 54 మంది చనిపోయారు. బీహార్ లో 32 మంది వడదెబ్బతో మరణించగా, ఔరంగా బాద్ లో 17మంది, అర్రాలో ఆరుగురు, గయా, రోహతాస్ లలో ముగ్గురు చొప్పున, బక్సర్ లో ఇద్దరు, పాట్నాలో ఒకరు మృతిచెందారు. ఒడిశాలోని రూర్కెలాలో వడదెబ్బతో 10మంది చనిపోయారు. జార్ఖండ్ లోని పాలం, రాజస్థాన్ లో ఐదుగురు చొప్పున, ఉత్తరప్రదేశ్ లో ఒకరు మృతిచెందారు. 

మరోవైపు నైరుతి రుతుపవనాలు దక్షిణాది రాష్ట్రాలు, ఈశాన్యా ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. నైరుతి రుతు పవనాలు లక్ష ద్వాప్, కేరళలోని మరికొన్ని ప్రాంతాలు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడు, అసోం, మేఘాలయలోని కొన్ని ప్రాంతాల్లో విస్తరిస్తున్నాయి. రెండు మూరు రోజుల్లో పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని IMD తెలిపింది.