Cricket World Cup 2023: ఓడిపోతున్నా వీటికేం తక్కువ లేదు: సౌతాఫ్రికా బౌలర్‌ను దూషించిన పాక్ బ్యాటర్

Cricket World Cup 2023: ఓడిపోతున్నా వీటికేం తక్కువ లేదు: సౌతాఫ్రికా బౌలర్‌ను దూషించిన పాక్ బ్యాటర్

వరల్డ్ కప్ లో పాక్ ఆటగాళ్లు వరుస ఓటములు ఎదర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో కీలక మ్యాచ్ ఆడుతుంది. సెమీ ఫైనల్ రేస్ లో ఉండాలంటే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో పాక్ తడబడుతుంది. టాస్ గెలిచి మొదట   బ్యాటింగ్ తీసుకున్న పాక్  ఆరంభంలోనే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. దీంతో 38 పరుగులకే రెండు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ఈ దశలో క్రీజ్ లోకి వచ్చిన రిజవాన్.. జాన్సెన్ మధ్య మాటల యుద్ధం జరిగింది. 

రిజ్వాన్‌ ఇచ్చిన క్యాచ్ ను జాన్సెన్ అందుకునే ప్రయత్నంలో జారవిడిచాడు. దీంతో బతికిపోయిన పాక్ వికెట్ కీపర్.. ఆ తర్వాత బంతిని ఫోర్ కొట్టి తన ప్రతీకారాన్ని తీర్చుకున్నాడు. అయితే ఆ తర్వాత డాట్ బాల్ విసిరిన జాన్సెన్.. రిజ్వాన్‌ వైపు కోపంగా చూసాడు. దీంతో రిజ్వాన్‌ ఏంటి అలా చూస్తున్నావ్ వెళ్లి బాల్ తెచ్చుకో అంటూ జాన్సెన్ వైపుకు దూసుకొచ్చాడు. దీంతో కోపాన్ని నియంత్రించుకోలేని జాన్సెన్.. రిజ్వాన్‌ పై మాటల యుద్ధానికి దిగాడు. 

క్రమంగా వీరి మధ్య గొడవ పెరుగుతుండగా దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ కొయెట్జ్ వచ్చి వీరిని ఆపాడు. దీంతో ఈ వాగ్వాదానికి తెరపడింది. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే ప్రస్తుతం పాక్.. 37 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. క్రీజ్ లో సౌద్ షకీల్(37) షాదాబ్ ఖాన్(27) ఉన్నారు. పాక్ కెప్టెన్ బాబర్ అజామ్(50) హాఫ్ సెంచరీ చేసాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో జాన్సెన్, షంసి 2 వికెట్లు తీసుకోగా కొయెట్జ్ ఒక వికెట్ తీసుకున్నాడు.