
న్యూఢిల్లీ: బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. కొన్ని రోజులుగా పరుగులు పెడుతున్న పసిడి ధర మంగళవారం కూడా పెరిగింది. మంగళవారం నాటి బులియన్ ట్రేడింగ్ లో 10గ్రాముల గోల్డ్ ధర్ రూ.200 పెరిగి, రూ.38 వేల770 వద్ద ఆల్ టైం రికార్డు స్థాయి ధరను నమోదు చేసింది. అయితే వెండి రూ.1,100 తగ్గి రూ.43,900లకు చేరింది.