
రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణలో ఆర్టీసీ బస్సులు కిటకిటలాడుతున్నాయి. అన్నదమ్మలకు రాఖీ కట్టేందుకు జనాలు బస్సు బాట పట్టారు. అందులోనూ మహిళలకు ఉచితమే గదా..! కరీంనగర్ జిల్లా జమ్మికుంట బస్టాండ్లో జనాల రద్దీ ఎక్కువుగా ఉంది. ప్రతి బస్సులో కూడా కెపాసిటీకి మించి జనాలు ఎక్కుతున్నారు. తెలంగాణ ఆర్టీసీ బస్సులు నడుపుతున్నా...వాటికి మించి ప్రజలు ప్రయాణం చేస్తున్నారు.
సోదరులకు రాఖీ కట్టేందుకు సోదరీమణులు ప్రయనమయ్యారు. సొంతూళ్లు వెళ్లేందుకు మహిళలు బస్టాండ్ లకు రావడంతో కిక్కిరిసి పోయాయి. వరుస సెలవులు.. రాఖీపౌర్ణమి కలసి రావడంతో బస్సులు కిటకిలాడుతున్నాయి. ఒక్కో బస్సులో దాదాపు 100 మంది ఎక్కుతున్నారు. జనాల రద్దీతో ఆర్టీసీ కండక్టర్.. డ్రైవర్ చాలా ఇబ్బంది పడుతున్నారు.
ALSO READ : రాఖీ పండుగ.. వింత ఆచారం..
కరీనగర్ జిల్లా జమ్మికుంట లోఆర్గీసీ బస్టాండ్ ప్రాంగణము నిండిపోయింది. రాఖీపూర్ణిమ సందర్భంగా ఒకటో డిపో నుంచి 440 బస్సులను నడుపుతున్నారు. గోదావరిఖని, మంచిర్యాల వైపు వెళ్లే బస్సులు సరిపోకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తిరుగు ప్రయాణంలో ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా తగినన్ని బస్సులు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.