
వేములవాడ, వెలుగు : వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. దసరా సెలవులు ముగుస్తుండడంతో తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ట్ర నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజామునే కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించిన భక్తులు అనంతరం ధర్మగుండంలో స్నానం ఆచరించారు. కోడెల క్యూలైన్, ధర్మదర్శనం క్యూలైన్ మీదుగా ఆలయంలోకి ప్రవేశించి లక్ష్మీగణపతి స్వామివారిని, రాజరాజేశ్వర స్వామిని, అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం కోడె మొక్కులు చెల్లించారు. వేములవాడ అనుబంధ ఆలయమైన భీమేశ్వర ఆలయంలోనూ భక్తుల రద్దీ నెలకొంది.