బాసర ఆలయంలో భక్తుల రద్దీ.. ఉచిత దర్శనానికి 3 గంటలు

బాసర ఆలయంలో భక్తుల రద్దీ.. ఉచిత దర్శనానికి 3 గంటలు

భక్తుల రద్దీతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర జ్ఞాన సరస్వతి ఆలయం కిటకిటలాడుతోంది. వేసవి సెలవులతో పాటు ఆదివారం కూడా కలిసి రావడంతో సరస్వతి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఉదయం గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూ లైన్ లో నిలుచున్నారు. 

వేసవి సెలవుల కారణంగా మూసుకున్న పాఠశాలలు 2023 జూన్ 12  నుంచి తెరుచుకోనున్నాయి. ఈ క్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించడానికి బాసర ఆలయానికి తరలి వస్తున్నారు. దీంతో క్యూ లైన్లలో భక్తుల రద్దీ భారీగా పెరిగిపోయింది. ఉచిత దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. లడ్డు ప్రసాదం కౌంటర్లు, కల్యాణ కట్ట వద్ద కూడా భక్తుల కోలాహలం నెలకొంది.

రద్దీ కారణంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. ఎండల తీవ్రత దృష్ట్యా చలువ పందిళ్లు కూడా ఏర్పాటు చేశారు.