కారులో పెట్రోల్ పోస్తుండగా బంక్‌లో అగ్ని ప్రమాదం

కారులో పెట్రోల్ పోస్తుండగా బంక్‌లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్: కారులో పెట్రోల్ నింపుతుండగా అగ్ని ప్రమాదం జరిగిన సంఘటన మంగళవారం హైదరాబాద్ లో జరిగింది. షేక్ పేటలోని ఓ పెట్రోల్ బంక్ లో జరిగిన ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్దం కాగా.. పెట్రోల్ నింపే ఫిల్లింగ్ మిషన్ లు కాలిపోయాయి. పెట్రోల్ బంక్ సిబ్బంది వెంటనే ఫైర్ స్టేషన్ ఫోన్ చేశారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే వచ్చి మంటలను అదుపులోకి తేవడంతో పెను ప్రమాదం తప్పింది.

సమాచారం అందుకున్న గోల్కొండ పోలీసులు ఘటనస్థలికి చేరుకుని పెట్రోల్ లీక్ అవ్వడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాదమికంగా నిర్దారించారు. ప్రమాదం జరిగిన వెంటనే కారు యజమాని పరారయ్యాడని తెలిపారు బంక్ సిబ్బంది. సిసి పుటేజ్ ను పరిశీలించాక ప్రమాదంపై పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పారు పోలీసులు.