వరద నీటిలో 260 అపార్ట్ మెంట్లు..

వరద నీటిలో 260 అపార్ట్ మెంట్లు..

నిన్న రాత్రి కురిసిన వర్షానికి మేడ్చల్ జిల్లా  నాగారం మున్సిపాలిటీలోని మోడీ పారామౌంట్ రెసిడెన్సీలో భారీగా వరద నీరు చేరింది. ఈ రెసిడెన్సీలో దాదాపు 260 అపార్ట్ మెంట్లు ఉన్నాయి. ఇందులో వెయ్యి మందికి పైగా నివసిస్తున్నారు. నీళ్లు తొలగించాలని కోరినా అధికారులు పట్టించుకోవడం లేదని అపార్ట్ మెంట్ వాసులు అన్నారు.

బయటకు వెళ్లే దారి లేక అపార్ట్ మెంట్ వాసులు నానా ఇబ్బందులు  పడుతున్నామన్నారు. దమ్మాయిగూడాలోని సూర్యనారాయణ చెరువు నిండినప్పుడల్లా వరద వస్తోందని చెప్పారు. నాగారం ఎక్స్ రోడ్డులోని విశాల్ మార్ట్ దగ్గర నుంచి వచ్చే నీటిని మూసీ కాలువలోకి మళ్లించాలని కోరుతున్నా.. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించడం లేదన్నారు. తమ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయిన మంత్రి మల్లారెడ్డి  జోక్యం చేసుకోని తమను ఆదుకోవాలని   అపార్ట్మెంట్ వాసులు కోరారు.