జంట జలాశయాలకు భారీగా వరద..దిగువకు నీటి విడుదల..ప్రజలకు హెచ్చరిక

జంట జలాశయాలకు భారీగా వరద..దిగువకు నీటి విడుదల..ప్రజలకు హెచ్చరిక

రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో  ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జంట జలాశయాలకు వరద పోటెత్తడంతో..నిండుకుండల్లా మారాయి. ఈ క్రమంలోనే అధికారులు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ల నుంచి నీటిని దిగువకు వదిలారు. రెండు జలాశయాల్లోని ఆరు గేట్ల చొప్పున ఎత్తి..నీటిని దిగువకు విడుదల చేశారు. 

సెప్టెంబర్ 05వ తేదీ ఉదయం నాటికి ఉస్మాన్ సాగర్ పూర్తి ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టిఎల్) 1790 అడుగులు కాగా..ప్రస్తుతం 1789 అడుగుల వరకు నీరుంది. అదేవిధంగా, హిమాయత్ సాగర్ నీటి మట్టం 1763.20 అడుగులకు గాను ఎఫ్‌టిఎల్ 1763.50 అడుగులుగా ఉంది. 

ALSO READ :మూసీ పరివాహక ప్రాంతాల ప్రజల్ని భయపెడుతున్న వరద

ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి నీటిని దిగువకు వదలడంతో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. జియాగూడ, పురానాపూల్, దుర్గానగర్, సరూర్‌నగర్ వాసులను అలర్ట్ చేశారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.