కాళేశ్వరంలోకి భారీగా వరద నీరు.. మేడిగడ్డ బ్యారేజీ గేట్ల ఎత్తివేత

కాళేశ్వరంలోకి భారీగా వరద నీరు.. మేడిగడ్డ బ్యారేజీ గేట్ల ఎత్తివేత

తెలంగాణ అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కాళేశ్వరం ప్రాజెక్టులోనికి  భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారెజి గేట్లను ఇంజనీరింగ్ అధికారులు ఈరోజు ఉదయం నుంచి ఎత్తి ఉంచారు. గత ఐదు రోజుల నుండి ఎగువ ప్రాంతం మహారాష్ట్ర లో కురుస్తున్న వర్షాలకు ప్రాణహిత నది ఉదృతంగా ప్రవహిస్తున్నాయి.కాళేశ్వరం వద్ద గోదావరి వరద నీరుతో పరవళ్లు తొక్కుతు,పుష్కర ఘాట్ వద్ద 8 మీటర్ల ఎత్తు నుండి ప్రవహిస్తుంది. దీంతో మేడిగడ్డ బ్యారెజి వద్ద నీటి మట్టం పెరిగే అవకాశం ఉండడంతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బ్యారెజిలో 7.0 టీఎంసీల నీటి నిల్వ ఉండడంతో.మేడిగడ్డ బ్యారేజ్ 85 గేట్లకు గాను 65 గేట్లను అర మీటర్ ఎత్తున ఎత్తి ఉంచారు. 3,50 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కన్నేపల్లి పంపుహౌస్ వద్ద గత నాలుగు రోజుల నుండి మోటర్లను నిలిపివేశారు. ప్రస్తుతం అన్నారం బ్యారేజ్ వద్ద 8.65 క్యూసెక్కుల నీరు నిలువ ఉంది..