సింగూర్ ప్రాజెక్టకు భారీగా వరద

సింగూర్ ప్రాజెక్టకు భారీగా వరద

ఇటీవల కురిసిన వర్షాలకు సింగూర్ ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు చేరుతోంది. ఇప్పటికే  5, 6, 8, 9, 10,11 నంబర్ల గేట్లు ఎత్తగా శనివారం 15వ నంబర్ గేటును కూడా ఎత్తారు. 7 గేట్ల ద్వారా 74,722 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. 

విద్యుత్ కేంద్రం ద్వారా 1,732 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 29.117 టీఎంసీలు కాగా 19.113 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇరిగేషన్ డీఈఈ నాగరాజు, ఏఈ స్టాలిన్, జేఈ మహిపాల్ రెడ్డి వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తున్నారు. - పుల్కల్, వెలుగు