ఢిల్లీని కమ్మేసిన పొగమంచు

ఢిల్లీని కమ్మేసిన పొగమంచు

ఢిల్లీని ఇవాళ ఉదయం దట్టమైన పొగమంచు కప్పేసింది. నగరంలో ఎటు చూసిన పొగమంచే కనిపించింది.  IMD నివేదిక ప్రకారం దేశ రాజధానిలో కనిష్ట ఉష్ణోగ్రత 6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు అయ్యింది. ఢిల్లీ ఎయిర్‌ పోర్టులో పొగమంచు కారణంగా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ల్యాండింగ్, టేకాఫ్‌లకు కాస్త ఇబ్బందులు తలెత్తాయి. అయితే అన్ని విమాన కార్యకలాపాలు సాధారణంగా నడుస్తున్నాయి. విమాన సమాచారం కోసం ప్రయాణికులు సంబంధిత విమానయాన సంస్థను సంప్రదించవలసిందిగా ఎయిర్ పోర్టు అధికారులు చెబుతున్నారు. 

పంజాబ్, రాజస్థాన్, తూర్పు ఉత్తరప్రదేశ్ మరియు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కనిపించింది. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌లో శనివారం ఉదయం దృశ్యమానత 50 మీటర్లుగా నమోదైంది. శనివారం ఉదయం నమోదైన దృశ్యమానత (200 మీటర్లు లేదా అంతకంటే తక్కువ) అమృత్‌సర్‌లో 25 మీటర్లు; సఫ్దర్‌జంగ్ (ఢిల్లీ), బహ్రైచ్ మరియు లక్నోలో 50 మీటర్లు; గంగానగర్, పాలం (ఢిల్లీ) మరియు వారణాసిలో 200 మీటర్లుగా ఉంది.

ఇవి కూడా చదవండి:

ఢిల్లీలో భూకంపం.. భయంతో జనాల ఉరుకులు