మహారాష్ట్రలో మామిడిపళ్ల ధర చుక్కల నంటుతోంది. ఎక్స్ పోర్ట్ క్వాలిటీ హపుస్ రకం మామిడి పళ్లు కిలో 2వేల 500 రూపాయలకు పైగా పలుకుతున్నాయి. నాషిక్ జిల్లాలో దేవ్ గఢ్ హపుస్ మామిడి రకానికి ఫేమస్. అక్కడ పండించే పళ్లన్నీ దాదాపు విదేశాలకు ఎక్స్ పోర్ట్ అవుతాయి. ఈ సూపర్ ప్రీమియం రకం మామిడి పళ్లను కంటెయినర్ బాక్సుల్లో డెకోరేట్ చేసి అమ్ముతున్నారు. ఈ మధ్యే దేవ్ గడ్ నుంచి ఎక్స్ పోర్ట్ అయిన హపుస్ మామిడి పళ్లు లండన్ లో కిలో 5వేల రూపాయలకు అమ్ముడయ్యాయి. ఈ హపుస్ మామిడి పళ్లను సాధారణంగా అల్ఫాన్సో అని కూడా పిలుస్తారు.
