ఇయ్యాల, రేపు ఐదు జిల్లాల్లో  రెడ్​ అలర్ట్​

ఇయ్యాల, రేపు ఐదు జిల్లాల్లో  రెడ్​ అలర్ట్​

రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం, గురువారం సాధారణం నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని, ఈ నెల 15, 16 తేదీల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది. బుధవారం, గురువారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, ఆసిఫాబాద్​, మంచిర్యాల జిల్లాలకు రెడ్ వార్నింగ్ జారీ చేసింది.

కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్ లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి, మహబూబాబాద్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవచ్చని పేర్కొంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది.