తెలంగాణకు భారీ వర్ష సూచన

తెలంగాణకు భారీ వర్ష సూచన

తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. వాహనదారులు, పాదాచారులు పలు సమస్యలను ఎదుర్కొన్నారు. బుధవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అల్పపీడనం, ఉపరితల ఆవర్తనంతో ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. 

  • ఏఎస్ రావు నగర్ లో 3.2 సెంటీమీటర్ల వర్షపాతం
  • చర్లపల్లి లో 2.9 సెంటీమీటర్లు
  • శేర్ లింగంపల్లిలో 2.5 సెంటీమీటర్లు
  • కాప్రా, నేరెడ్ మెట్ లో 2.2 సెంటీమీటర్లు
  • మౌలాలి లో 2.1 సెంటీమీటర్
  • హఫీజ్ పేట్ లో 2 సెంటీమీటర్లు
  • మాదాపూర్ లో 1.8 సెంటీమీటర్లు
  • గచ్చిబౌలి, హస్తినాపురం, చందానగర్ లో 1.7 సెంటీమీటర్లు
  • మియాపూర్ లో 1.6 సెంటీమీటర్లు
  • సఫీల్ గూడాలో 1.5 సెంటీమీటర్లు
  • జీడిమెట్ల, కేపీ హెచ్ బీ, చాంద్రాయణగుట్టలో 1.4 సెంటీమీటర్లు
  • తిరుమలగిరి, షాపూర్ నగర్, హయత్ నగర్ లో 1.3 సెంటీమీటర్లు
  • కంచన్ బాగ్ లో 1.2 సెంటీమీటర్లు
  • ఆర్ సీ పురం, బహదూర్ పురాలో 1.1 సెంటీమీటర్ వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ పేర్కొంది.