హైదరాబాద్ లోని పలు ఏరియాల్లో వర్షం దంచికొడుతోంది. ఉరుము, మెరుపు లేకుండా ఒక్కసారిగా వర్షం పడుతోంది. ఉదయం నుంచి పొడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మేఘావృతమై వర్షం కురుస్తోంది. గచ్చిబౌలి ,మాదాపూర్ ,కోండాపూర్ చందానాగర్, మియపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట్, లక్డికాపూల్, ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.
సికింద్రాబాద్, మలక్ పేట, దిల్ సుఖ్ నగర్, చంపా పేట, కొత్త పేట పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి పలు చోట్ల రోడ్లు జలమయం అయ్యాయి. వర్షపు నీరు రోడ్లపై నిలిచి వాహనదారులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. పలు ఏరియాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
ఇదిలా ఉండగా బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండం మారింది. దీని ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని సూచించింది వాతావరణ శాఖ. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ
►ALSO READ | నవీన్ యాదవ్ గల్లీల బిడ్డ..గడీల బిడ్డ కాదు: మంత్రి సీతక్క
ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, కొమరం భీం ఆసిఫాబాద్, మహబూబ్నగర్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్ మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్, నల్లగొండ, నారాయణపేట, నిర్మల్, రంగారెడ్డి, సంగారెడ్డి తోపాటు పలు జిల్లాల్లో చిరుజల్లుల నుంచి మోస్తారు వర్షాలు పడతాయని.. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని చెప్పింది.
