నవీన్ యాదవ్ గడీల బిడ్డ కాదు..గల్లీల బిడ్డ, గరీబోళ్ల బిడ్డ అని అన్నారు మంత్రి సీతక్క. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా జూబ్లీహిల్స్ లో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ నవీన్ యాదవ్ ను గెలిపించాలని కోరారు. బోరబండ సైట్ 3 లోని జ్యోతి నగర్ కాలనీలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో ప్రసంగించిన మంత్రి సీతక్క .. జూబ్లీహిల్స్ అభివృద్ధికి నవీన్ యాదవ్ గెలుపు చాలా అవసరం ఉందన్నారు. మూడుసార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నా అభివృద్ధి జరగలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాత ప్రభుత్వం అని చెప్పారు. అందుకే పేదలకు ఉచితంగా బియ్యం, ఉచిత రవాణా, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు సీతక్క అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగున్నర లక్షల మందికి ఇండ్లను మంజూరు చేశామన్నారు మంత్రి సీతక్క. జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ గెలిస్తే పేదలకు ఇండ్లు వస్తాయన్నారు. పట్టణాలలో తక్కువ జాగా ఉన్నవాళ్లు ఇండ్లు కట్టుకునేందుకు రూల్స్ ను మార్చామ చెప్పారు. పట్టణాల్లో జి ప్లస్ వన్ విధానంలో ఇల్లు కట్టుకునేందుకు జీవో ఇచ్చాని చెప్పారు. మహిళల అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ప్రతి మహిళను మహిళా సంఘంలో చేర్చుతున్నాం.. మహిళలకు 27 వేల కోట్ల బ్యాంకు రుణాలు ఇచ్చామని చెప్ారు. మహిళా సంఘాలకు ప్రమాద బీమా లోన్ బీమా కల్పిస్తున్నాం
అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ వాళ్లు ఏమి పని చేయలేదని ఫైర్ అయ్యారు పనిచేసే వ్యక్తిగి గుర్తించవ్చచ్చు. నవీన్ పేరులోనే విన్ ఉందన్నా ఆయన పేరులోనే గెలుపు ఉం దన్నారు. ఆయన విజయం సాధించడం ఖాయమన్నారు. హస్తం గుర్తుకు ఓటు ఇస్తే సంక్షేమ పథకాలు వస్తాయిన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచిన ఉపయోగం లేదన్నారు సీతక్క. నవీన్ రెండుసార్లు ఓటమిపాలైన వెనుకడుగు వేయలేదన్నారు. ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూనే ఉన్నాడని.. జూబ్లీహిల్స్ ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలంటే నవీన్ యాదవ్ గెలవాలన్నారు.
►ALSO READ | జూబ్లీహిల్స్ లో గెలిచేది కాంగ్రెస్సే: వివేక్ వెంకటస్వామి
రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వానికి, జూబ్లీహిల్స్ ప్రజలకు మధ్య వారధిగా నవీన్ యాదవ్ సేవలందిస్తాడన్నారు. ఇల్లు కావాలంటే కాంగ్రెస్కు .. కన్నీళ్లు కావాలంటే బీఆర్ఎస్ కు ఓటెయ్యాలని పిలుపునిచ్చారు. ఈ సమయంలో జూబ్లీహిల్స్ కు కావాల్సింది సెంటిమెంట్ కాదు.. డెవలప్మెంట్ అని అన్నారు సీతక్క. బీఆర్ఎస్ మాయమాటలకు మోసపోవద్దు..మోసపోతే గోసబడుతామని చెప్పారు. కాంగ్రెస్ కు ఓటేసి నవీన్ యాదవ్ అని గెలిపిస్తే అభివృద్ధి చేసే బాధ్యత తమదన్నారు. కొత్త ఇల్లు, కొత్త రేషన్ కార్డులు, కొత్త రోడ్లు, కావాలంటే నవీన్ యాదవ్ కి ఒక అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరారు సీతక్క.

