హైదరాబాద్ సిటీ మొత్తం వర్షం : ఆఫీసుల నుంచి వెళ్లే టైంలో ట్రాఫిక్ పరేషాన్

హైదరాబాద్ సిటీ మొత్తం వర్షం : ఆఫీసుల నుంచి వెళ్లే టైంలో ట్రాఫిక్ పరేషాన్

హైదరాబాద్ సిటీలో వర్షం. తెలంగాణలో రుతు పవనాలు ఎంట్రీ తర్వాత.. ఫస్ట్ టైం సిటీ మొత్తం చల్లటి వాతావరణం. టెంపరేచర్ తగ్గింది. 2026, జూన్ 9వ తేదీ సోమవారం సాయంత్రం నుంచి వర్షం మొదలైంది. సిటీ మొత్తం వర్షం పడుతుంది. ఈవినింగ్ ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే టైంలో వర్షం పడుతుండటంతో.. ట్రాఫిక్ పరేషాన్ లో ఉన్నారు వాహనదారులు. 

హైదరాబాద్ సిటీలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, టోలిచౌకి, ఫిల్మ్ నగర్, పంజాగుట్ట, అమీర్ పేట, ఖైరతాబాద్, బేగంటపేట ఏరియాల్లో మోస్తరు వాన పడుతుంది. అబిడ్స్, కోఠి, బషీర్ బాగ్, నారాయణగూడ ఏరియాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం పడుతుంది. ఇక మియాపూర్, కూకట్ పల్లి ప్రాంతాల్లోనూ వర్షం పడుతుంది.అబిడ్స్ , కోఠి , బషీర్ బాగ్  పరిసరాల్లో ఈదురుగాలులతో కురుస్తున్న వర్షం పడుతోంది. 

ఉప్పల్,నాగారం,అల్వాల్, నాచారం ,మల్లాపూర్, తార్నాక, హబ్సిగూడ, ఓయూ క్యాంపస్, లాలాగూడ ,లాలాపేట పరిసర ప్రాంతాలలో వర్షం కారణంగా వాహనదారులు వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు .


మరో మూడు గంటలు అలర్ట్...

 మరో రెండు గంటల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదురుగాలితో కూడిన వర్షాలు కురిసే అవకాశంతో  ఆరెంజ్, ఎల్లో కలర్ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ.  రాబోయే రెండు మూడు గంటల్లో మోస్తారు వర్షం, గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలలతో తో కూడిన వర్షం  హైదరాబాద్, కామారెడ్డి, కరీంనగర్ , కుమారం భీమ్ మంచిర్యాల,మెదక్ , మేడ్చల్ మల్కాజ్గిరి , నల్గొండ పెద్దపల్లె రాజన్న సిరిసిల్ల , రంగారెడ్డి , సంగారెడ్డి , సిద్దిపేట , యాదాద్రి భువనగిరి జిల్లాలో వర్షాలు కురిసే అవకాశంతో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది

►ALSO READ | తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు

 తేలికపాటి వర్షంతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగల్లుతో కూడిన వర్షాలు భద్రాద్రి  కొత్తగూడెం జగిత్యాల జనగాం ,  జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, ఖమ్మం,  మహబూబాబాద్, ములుగు, నారాయణపేట, సూర్యాపేట ,వికారాబాద్ ,వరంగల్, హనుమకొండ జిల్లాల్లో కురిసే అవకాశం  ఉందని ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.