భారీ వర్షంతో హైదరాబాదీల ఇబ్బందులు

భారీ వర్షంతో హైదరాబాదీల ఇబ్బందులు

హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం మధ్యాహ్నం భారీ వర్షం  కురిసింది. ఉరుములు మెరుపుల‌తో పాటు బ‌ల‌మైన ఈదురు‌ గాలుల కూడిన వర్షం కురిసింది. ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌, మాదాపూర్, గచ్చిబౌలి, పంజాగుట్ట, కూకట్‌పల్లి, మైత్రీవనం, బాలానగర్ తదితర ప్రాంతాల్లో  భారీ వర్షం కురిసింది.  భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రధాన రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడటంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.మరికొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. గ‌త కొద్ది రోజులుగా తెలంగాణ‌లోని ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి.

రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర బంగాళాఖాతంలో ఆగష్టు 4న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పింది.