
హైదరాబాద్: సిటీలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. మధ్నాహ్నం నుంచి చల్లబడ్డ వాతావరణం సాయంత్రానికి ఒక్కసారిగా మారిపోయింది. బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, కోఠి, ఉప్పల్, నాగోల్, సికింద్రాబాద్‌తో పాలు ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతుంది. దాదాపు గంటన్నర నుంచి వర్షం వస్తుండటంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. సాయంత్రం సమయం కాబట్టి భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
గ్రేటర్ హైదరాబాద్‌లో కురుస్తున్న అకాల భారీ వర్షం క్రమంలో.. విద్యుత్ శాఖ సూపెరింటెండింగ్ ఇంజనీర్, చీఫ్ జనరల్ మేనేజర్ లతో విద్యుత్ సరఫరా పరిస్థితిని సమీక్షించారు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ సీఎండీ రఘుమా రెడ్డి.
ఈ సందర్భంగా మాట్లాడిన రఘుమారెడ్డి.. భారీ వర్ష ప్రభావం గల ప్రాంతాలైన రాజేంద్రనగర్, సైబర్ సిటీ, సెంట్రల్ సర్కిల్, సౌత్ సర్కిల్, బంజారా హిల్స్, సికింద్రాబాద్, హబ్సిగూడ, సరూర్ నగర్ సర్కిళ్ల ఇంజినీర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షం నీరు నిల్వ ఉన్న చోట విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లు, తీగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎక్కడైనా రోడ్లపై, భవనాలపై తీగలు తెగిపడి ఉంటే వెంటనే సంస్థ కు తెలియజేయలని తెలిపారు. వోల్టేజ్‌లో హెచ్చు తగ్గులు ఉన్నా, విద్యుత్ సరఫరా లో అంతరాయం కలిగితే.. 1912 / 100 / స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్ తో పాటు విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ 7382072104, 7382072106,7382071574 నెంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు రఘుమా రెడ్డి.
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం
అసిఫ్ నగర్ లో 7.1 సెంటిమిటర్లు
ఖైరతాబాద్ లో 5.5 సెంటిమిటర్లు
జూబ్లీహిల్స్ లో 4.9 సెంటిమిటర్లు
మెహదీపట్నం లో 3.4 సెంటిమీటర్లు
కార్వాన్ లో 3.3 సెంటిమిటర్లు
బేగంపెట్ లో 1.7 సెంటిమీటర్లు
గోశామహల్ లో 1.3 సెంటిమిటర్లు
సికింద్రాబాద్ లో 1.1 సెంటిమీటర్ల వర్ష పాతం నమోదు