హైదరాబాద్లో పలు చోట్ల వర్షం.. మరో రెండు గంటలు అలర్ట్

హైదరాబాద్లో  పలు చోట్ల వర్షం.. మరో రెండు గంటలు అలర్ట్

హైదరాబాద్ లోని పలు చోట్ల భారీ వర్షం పడుతోంది.  ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది.  బంజారాహిల్స్, జూబ్లీహిల్స్,అమీర్ పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్,  కూకట్ పల్లి, మియాపూర్, చందానగర్, లింగంపల్లి,కొండాపూర్, హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, మణికొండ, సికింద్రాబాద్, ఈసీఐఎల్, ఎల్బీనగర్, దిల్ సుఖ్ నగర్, ఉప్పల్, నారాయణ గూడలో వర్షం పడుతోంది. మరో రెండు గంటల పాటు నగరంలో  భారీగా వర్షం పడే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

 వర్షానికి రోడ్లపై భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. రోడ్లపై నీళ్లు ఆగిపోవడంతో వాహనాలు నెమ్మదిగా కదలుతున్నాయి.  పంజాగుట్ట నుంచి సికింద్రాబాద్ వెళ్లే మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అటు కూకట్ పల్లి నుంచి అమీర్ పేట మార్గంలో వాహనాలు నిలిచిపోయాయి.  వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. ఇంటికి వెళ్లే సరికి గంటల సమయం పడుతుంది.  కొన్ని చోట్ల కరెంట్ సరఫరా నిలిచిపోయింది. వర్షానికి జనం చీకట్లోనే ఉండాల్సి వస్తోంది. మరో వైపు లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో  నగరవాసులు అవస్థలు పడుతున్నారు.