
హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలో కొన్నిరోజులుగా పగలంతా ఎండ, రాత్రి వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగి, ప్రధాన రహదారులపై వరద నీరు నిలిచిపోతోంది.
ట్రాఫిక్ జామ్తో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం కూడా ఇలాగే మోస్తరు వర్షం పడింది. రాత్రి 11 వరకు కుత్బుల్లాపూర్లో 3.03 సెంటీమీటర్లు, ఆర్సీపురం 2.08, కూకట్ పల్లి 1.95, బాలానగర్ 1.78, రాజేంద్రనగర్ 1.58 సెం.మీ వర్షం పడింది.