గ్రేటర్​లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం

గ్రేటర్​లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం

గ్రేటర్​లోని పలు ప్రాంతాల్లో మంగళవారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం 3 గంటలకు ఉరుములు, మెరుపులతో మొదలై దంచికొట్టింది. అత్యధికంగా సరూర్​నగర్​లో 5.9 సెంటీ మీటర్ల వాన పడింది. ముందురోజు కురిసిన వాన నీళ్లను క్లియర్ ​చేయక ముందే మరోసారి దంచికొట్టడంతో ఎక్కడికక్కడ మోకాలి లోతు నీరు నిలిచింది. బేగంపేట, పంజాగుట్ట, లిబర్టీ, హిమాయత్​నగర్, మెహిదీపట్నం, రేతిబౌలి, చాంద్రాయణగుట్ట, ఎల్​బీనగర్, మలక్​పేట, కోఠి, ఖైరతాబాద్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. నాంపల్లి కట్టెల మండిలోని తన ఇల్లు కూలిందని, డ్రైనేజీ సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని బాధితులు ట్విట్టర్​లో జీహెచ్ఎంసీ అధికారులకు మొరపెట్టుకున్నారు.         

– హైదరాబాద్/శంషాబాద్/వికారాబాద్/ఎల్​బీనగర్, వెలుగు