హైదరాబాద్లో భారీ వర్షం..లోతట్టు ప్రాంతాలు జలమయం

హైదరాబాద్లో భారీ వర్షం..లోతట్టు ప్రాంతాలు జలమయం

తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలడంతో రాష్ట్రవ్యాప్తంగా వానలు పడుతున్నాయి. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. కూకట్ పల్లి, ఆల్వాల్, మాదాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, చందానగర్  ఉప్పల్,బోడుప్పల్,తార్నాక, ఘట్కేసర్ ప్రాంతాల్లో వాన పడుతోంది. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద ప్రవాహానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.