కుత్బుల్లాపూర్‌‌లో భారీ వర్షం.. ఎక్కడ చూసినా నీళ్లే

కుత్బుల్లాపూర్‌‌లో భారీ వర్షం.. ఎక్కడ చూసినా నీళ్లే

చినుకు పడితే చాలు.. నగర రోడ్లు జలమయం అవుతున్నాయి. వర్షానికి కాలనీలు నీటితో దిగ్భందం అవుతున్నాయి. మోకాలి లోతులో ఉన్న నీటిలో వెళ్లాంటే అటు వాహనదారులు, ఇటు పాదాచారులు అష్టకష్టాలు పడుతున్నారు. పేరుకే మెగాసిటీ నగరం..చిన్న వర్షం పడితే రోడ్లన్నీ మోకాలు లోతు వాననీటి తో జలమయమై కాల్వలను తలపిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నగర ప్రజలు. మంగళవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో వర్షం కురిసింది. భారీగా కురిసిన వర్షానికి సూరారం నుండి మెదక్ వెళ్లే ప్రధాన రహదారిపై నీరు నిలిచిపోయింది. అలాగే మల్లారెడ్డి హాస్పిటల్ ఎదుట రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి.

ఇక వాహనదారుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. సరైన డ్రైనేజి వ్యవస్థ లేకపోవడంతో ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. ట్రాపిక్ తో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. చారాణ కోడికి బారాణ మసాల అన్నట్లుగా మున్సిపల్ అధికారుల తీరు ఉందని విమర్శిస్తున్నారు. రోడ్లపై నిలిచిన నీటిని పైపులతో తరలిస్తున్నారు. 100 మీటర్ల దూరంలో ఉన్న చెరువులో నీటిని పోస్తున్నారని వెల్లడించారు ఇప్పటికైనా అధికారులు స్పందించి వర్షం నీటిని డ్రైనేజి ద్వారా మళ్లించాలని స్థానికులు కోరుతున్నారు.