ఏపీకి వర్ష సూచన.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు

ఏపీకి వర్ష సూచన.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు

బంగాళాఖాతంలో  నవంబర్ 15న   నాటికి   పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇది వాయువ్య దిశగా పయనించి నవంబర్ 16  ఆంధ్రప్రదేశ్ తీరంలో  తీవ్రవాయుగుండంగా మారే అవకాశం ఉంది. శుక్రవారం నాటికి ఇది ఉత్తర- ఈశాన్య దిశగా తిరిగి ఒడిశా తీరానికి  చేరుకుంటుంది. 

అయితే  అల్పపీడన ప్రభావంతో  నవంబర్ 15న కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.  గుంటూరు, బాపట్ల, నెల్లూరు,సత్యసాయి,వైఎస్సార్ ,అన్నమయ్య,తిరుపతి, చిత్తూరు జిల్లాలో తేలిక పాటి నుంచి  మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాల నేపథ్యంలో  వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది.  మత్స్యకారులు వేటకు వెళ్లరాదని  హెచ్చరించింది.   

మరోవైపు.. తెలంగాణలోనూ పలు చోట్ల మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం పశ్చిమ వాయవ్య దిశగా ఉపరితల ఆవర్తనం పయనిస్తోందని చెప్పారు. సాధారణంగా నవంబర్ నెలలో బంగాళాఖాతం యాక్టివ్‌గా ఉంటుంది.తుఫాన్లు వచ్చే అవకాశాలు ఎక్కువే అని చెప్పవచ్చు.