ప్రజలకు ఏ అవసరమొచ్చినా అధికారులు సిద్ధంగా ఉండాలి

ప్రజలకు ఏ అవసరమొచ్చినా అధికారులు సిద్ధంగా ఉండాలి
  • సహాయక చర్యలకు అధికారులు సిద్ధంగా ఉండాలి
  • వర్షాలపై ముంపు ప్రాంతాల ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలి
  • నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ 

నల్లగొండ జిల్లా : భారీ వర్షాల నేపథ్యంలో నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కోరారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా.. అధికారులు సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురవనున్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలపై ఎమ్మెల్యే నోముల భగత్ స్పందించారు. 
లోతట్టు ప్రాంతాల్లో, ముంపు ప్రాంతలలో నివసించే ప్రజలకు భారీ వర్షాల సమాచారం ఎప్పటి కప్పుడు అందజేయాలని ఆయన ఆదేశించారు. అంతేకాదు.. వర్షాల వల్ల బలహీనంగా ఉండే చెరువు కట్టలు, పాత వంతెనలు, ప్రాణ హాని కలిగించే విద్యుత్ తీగలు, స్తంభాలు పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను హెచ్చరించారు.